‘బిగ్‌–బి’తో హాట్‌ సీట్‌లో సింధు | Bollywood icon Amitabh Bachchan pays emotional tribute to PV | Sakshi
Sakshi News home page

‘బిగ్‌–బి’తో హాట్‌ సీట్‌లో సింధు

Sep 29 2017 12:39 AM | Updated on May 28 2018 3:53 PM

Bollywood icon Amitabh Bachchan pays emotional tribute to PV  - Sakshi

ముంబై: భారత బ్యాడ్మింటన్‌ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో తళుక్కున మెరిసింది. బిగ్‌–బి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆడిన ఈ కేబీసీ సెలబ్రిటీ స్పెషల్‌ గేమ్‌ షో షూటింగ్‌ ఇటీవలే ముంబైలో జరిగింది. హాట్‌సీట్‌లోకి సింధును సాదరంగా ఆహ్వానించిన బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ ఆమె ఘనవిజయాలపై ప్రశంసలు కురిపించారు. ఈ స్పెషల్‌ షో షూటింగ్‌పై ఆయన తన బ్లాగులో ఇలా రాశారు... ‘ఆమెతో హాట్‌ సీట్‌ను పంచుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా.

దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఓ చాంపియన్‌ షట్లర్‌తో నాకు ఇది అసాధారణ భేటీ. అద్భుతమైన ఎపిసోడ్‌’ అని పేర్కొన్నారు. ఆమెతో కలిసి దిగిన ఫోటోల్ని పోస్ట్‌ చేశారు బిగ్‌–బి. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆమె ఘనవిజయాలు కొనసాగాలని అమితాబ్‌ బచ్చన్‌ ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక సెలబ్రిటీ ఎపిసోడ్‌ త్వరలో ‘సోనీ’ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్‌లో ప్రసారం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement