భవన్స్‌ జట్టుకు టైటిల్‌

Bhavans team got  handball title in inter college tournament - Sakshi

 అంతర్‌ కాలేజి హ్యాండ్‌బాల్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ అంతర్‌ కాలేజి హ్యాండ్‌బాల్‌ టోర్నమెంట్‌లో భవన్స్‌ (సైనిక్‌పురి) కాలేజి జట్టు సత్తా చాటింది. దూలపల్లిలోని సెయింట్‌ మార్టిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భవన్స్‌ జట్టు 14–9తో అరోరా డిగ్రీ కాలేజిపై గెలుపొందింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో లయోలా అకాడమీ 11–7తో బీఆర్‌ అంబేడ్కర్‌ కాలేజిపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ పోటీల్లో అరోరా 9–4తో లయోలా అకాడమీపై, భవన్స్‌ సైనిక్‌పురి 15–8తో బీఆర్‌ అంబేడ్కర్‌పై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్‌ మార్టిన్స్‌ కాలేజి చైర్మన్‌ ఎం. లక్ష్మణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

Back to Top