బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్ | Bengal Warriors hat-trick | Sakshi
Sakshi News home page

బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్

Feb 8 2016 2:31 AM | Updated on Sep 3 2017 5:08 PM

బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్

బెంగాల్ వారియర్స్ హ్యాట్రిక్

ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీమెంట్‌లో బెంగాల్ వారియర్స్ దూసుకెళుతోంది. సొంత వేదికపై ఆదివారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో...

కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్ టోర్నీమెంట్‌లో బెంగాల్ వారియర్స్ దూసుకెళుతోంది. సొంత వేదికపై ఆదివారం పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో 33-28 తేడాతో నెగ్గి వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకుంది. నితిన్ తోమర్ దుమ్ము రేపే ఆటతీరుతో 11 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహేశ్ గౌడ్ నాలుగు పాయింట్లు సాధించాడు. పుణేరి పల్టన్‌లో కెప్టెన్ మంజీత్ చిల్లార్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆరు రైడ్ పాయింట్లు.. ఏడు టాకిల్ పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.
 
తొలి అర్ధభాగంలో 10-11తో కాస్త వెనుకబడినా అనంతరం బెంగాల్ పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ గట్టి పోటీనిచ్చినప్పటికీ చివరికి జైపూర్ పింక్‌పాంథర్స్ 39-34 తేడాతో గట్టెక్కింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్; బెంగాల్ వారియర్స్‌తో ఢిల్లీ దబంగ్ జట్టు తలపడతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement