ఆ ముగ్గురి కొనసాగింపు...! | BCCI set to retain all three assistant coaches | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి కొనసాగింపు...!

Jun 14 2015 2:02 AM | Updated on Sep 3 2017 3:41 AM

భారత జట్టుకు సహాయక కోచ్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ బంగర్, బి.అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు చూపనుంది.

బంగర్, శ్రీధర్, అరుణ్‌ల వైపే బోర్డు మొగ్గు
 ముంబై: భారత జట్టుకు సహాయక కోచ్‌లుగా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్ బంగర్, బి.అరుణ్, ఆర్.శ్రీధర్‌లను కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు చూపనుంది. రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఈ త్రయం కూడా జట్టుతో పాటే చేరింది. వీరిలో బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌ల కాంట్రాక్ట్ రెన్యువల్‌పై ఇప్పటికే బోర్డు హామీ ఇచ్చినా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై స్పష్టత రాలేదు. ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ నుంచి బంగర్‌పై నెగటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ఆయన్ని మార్చాలని బోర్డు భావించింది. ఆమ్రే, రాజ్‌పుత్, రామన్‌లు ఈ రేసులో ఉన్నా బంగర్‌కు రవిశాస్త్రి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఉద్వాసన తప్పిందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement