బీసీసీఐ జోక్యం చేసుకోదు

BCCI not to intervene in Mohammed Shami-Hasin Jahan - Sakshi

షమీ భార్యకు స్పష్టం చేసిన బోర్డు అధ్యక్షుడు సీకే ఖన్నా  

ముంబై: క్రికెటర్ల వ్యక్తిగత, వైవాహిక విషయాల్లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జోక్యం చేసుకోదని తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టం చేశారు. తనను కలిసిన పేసర్‌ మొహమ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌కు ఇదే విషయాన్ని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

షమీ తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని ఇటీవల హసీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పలు కేసులు మోపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బోర్డు నుంచి కూడా ఒత్తిడి తేవాలని భావించిన ఆమె ఖన్నాను వ్యక్తిగతంగా కలిసింది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత వ్యవహారాల్లో బోర్డు ఎంతమాత్రం కలుగజేసుకోదని, కుటుంబ పరిధిలోనే సమస్యను పరిష్కరించుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలిపారు. త్వరలో జరిగే ఐపీఎల్, అనంతరం జరిగే ఇంగ్లండ్‌ సిరీస్‌లో షమీ రాణించాలని ఆశిస్తున్నట్లు ఖన్నా తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top