
ముంబై: ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో సాధ్యమైనంత ఎక్కువగా ఆదాయాన్ని దండుకోవాలని చూస్తున్న స్టార్ స్పోర్ట్స్ సంస్థ తమ కొత్త ప్రతిపాదనను బీసీసీఐ ముందు ఉంచగా... దానిని బోర్డు కరాఖండిగా తిరస్కరించేసింది. దేశంలో ఎన్నికల సీజన్ కాబట్టి ఐపీఎల్–2019లో ఓవర్ల విరామంలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది.
అయితే దీనికి బోర్డు అంగీకరించలేదు. బీసీసీఐ, స్టార్ మధ్య జరిగిన మీడియా హక్కుల ఒప్పందం (ఎంఆర్‌ఏ) ప్రకారం మ్యాచ్‌లు జరిగే సమయంలో రాజకీయ లేదా మతపరమైన ప్రకటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసారం చేయరాదు. ఇదే విషయాన్ని స్టార్‌కు చెప్పేసిన బోర్డు తన వైఖరిని స్పష్టంగా వెల్లడించింది.