అథ్లెట్లకు అండగా బంగ్లా కెప్టెన్‌ | Bangladesh captain Tamim Iqbal aids 91 athletes | Sakshi
Sakshi News home page

అథ్లెట్లకు అండగా బంగ్లా కెప్టెన్‌

Apr 28 2020 8:36 PM | Updated on Apr 28 2020 8:42 PM

Bangladesh captain Tamim Iqbal aids 91 athletes - Sakshi

ఢాకా : కరోనా మహమ్మారితో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌ అథ్లెట్లకు ఆ దేశ వన్డే క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ అండగా నిలిచాడు. మొత్తం 91 మందికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ తన చారిటీ ద్వారా ఫుట్‌ బాల్‌ ఆటగాళ్లు, క్రికెటర్లు, కబడ్డీ, వుషు, హాకీ ఆటగాళ్లు, సైక్లిస్టులు, స్విమ్మర్లు, జిమ్నాస్టులతోపాటూ కోచ్‌లకు సహాయం అందించనున్నాడు.

‘ఆటలతో నాకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. కానీ, ఓ ఆటగాడు మిగతా క్రీడాకారులకు కష్టకాలంలో అండగా ఉండటం ఇంత వరకు చూడలేదు. అందరికీ పరిచయం ఉన్న వాళ్లనే కాదు, కష్టాల్లో ఉన్న మామూలు స్థాయి ఆటగాడినైనా ఆదుకోవడానికి తమీమ్‌ ముందుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలిచాడు’ అని బంగ్లాదేశ్‌ స్మిమ్మర్‌ మహఫుజా ఖాతున్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement