రెజ్లర్‌ బజరంగ్‌ ఖాతాలో మరో స్వర్ణం  | Bajrang Punia bags gold in Ali Aliyev wrestling tournament | Sakshi
Sakshi News home page

రెజ్లర్‌ బజరంగ్‌ ఖాతాలో మరో స్వర్ణం 

May 3 2019 4:50 AM | Updated on May 3 2019 4:50 AM

Bajrang Punia bags gold in Ali Aliyev wrestling tournament - Sakshi

అలీ అలియెవ్‌ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా స్వర్ణ పతకాన్ని సాధించాడు. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో బజరంగ్‌ 65 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. గురువారం జరిగిన ఫైనల్లో బజరంగ్‌ 13–8 పాయింట్ల తేడాతో విక్టర్‌ రసాదిన్‌ (రష్యా)పై గెలుపొందాడు.

ఈ ఏడాది బజరంగ్‌కిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. డాన్‌ కొలోవ్‌ టోర్నీలో పసిడి నెగ్గిన బజరంగ్‌ ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా బజరంగ్‌ తాను పాల్గొన్న గత తొమ్మిది టోర్నమెంట్‌లలో ఏడు స్వర్ణాలు నెగ్గడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement