నయోమి... నయా నంబర్‌వన్‌ 

Australian Open Champ Naomi Osaka Becomes Asia First No. 1 in Tennis - Sakshi

పారిస్‌: మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో జపాన్‌ ప్లేయర్‌ నయోమి ఒసాకా అధికారికంగా నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అధిరోహించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్స్‌ గెల్చుకోవడంతో ఒసాకా మూడు స్థానాలు ఎగబాకి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. అటు పురుషుల సింగిల్స్‌లోగాని, ఇటు మహిళల సింగిల్స్‌లోగాని ఆసియా నుంచి నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్న తొలి ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. 1975లో అధికారికంగా కంప్యూటర్‌ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక నంబర్‌వన్‌ స్థానానికి చేరిన 26వ మహిళా క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. 

అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) పురుషుల ర్యాంకింగ్స్‌లో నొవాక్‌ జొకోవిచ్‌ 10,955 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మూడు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి చేరాడు. రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) రెండో స్థానంలో ఉండగా... అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ఒక స్థానం మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌కు చేరాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top