భారత్తో వరల్డ్ టీ 20:ఆసీస్ బ్యాటింగ్ | australia won the toss and elected to bat first | Sakshi
Sakshi News home page

భారత్తో వరల్డ్ టీ 20:ఆసీస్ బ్యాటింగ్

Mar 27 2016 7:08 PM | Updated on Sep 3 2017 8:41 PM

భారత్తో వరల్డ్ టీ 20:ఆసీస్ బ్యాటింగ్

భారత్తో వరల్డ్ టీ 20:ఆసీస్ బ్యాటింగ్

వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఆదివారం ఇక్కడ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

మొహాలి: వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా ఆదివారం ఇక్కడ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొహాలి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా  తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఇప్పటివరకూ జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలవడంతో ఈ మ్యాచ్ లో  విజయం సాధించిన జట్టు ఎలాంటి గణాంకాలు, రన్‌రేట్‌లతో పని లేకుండా సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో భారత్-ఆసీస్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. 

 

ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా,  ఇదే మైదానంలో శుక్రవారం పాక్‌ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్‌కప్‌లలో 4 మ్యాచ్‌లలో చెరో 2 గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement