ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్‌

Australia whitewash Pakistan 5-0 despite Haris hundred - Sakshi

5–0తో పాకిస్తాన్‌పై వన్డే  సిరీస్‌ సొంతం

దుబాయ్‌: పాకిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 5–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ 20 పరుగులతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 327 పరుగుల భారీ స్కోరు చేసింది. ఉస్మాన్‌ ఖాజా (111 బంతుల్లో 98; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ ఆరోన్‌ ఫించ్‌ (69 బంతుల్లో 53; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్‌‡్ష (61; 5 ఫోర్లు, 1 సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (33 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు.

అనంతరం పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 307 పరుగులు చేసింది. హారిస్‌ సొహైల్‌ (129 బంతుల్లో 130; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో పోరాడినప్పటికీ పాక్‌ను గెలిపించలేకపోయాడు. షాన్‌ మసూద్‌ (50; 3 ఫోర్లు), ఇమాద్‌ వసీమ్‌ (50 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top