రెండో టెస్టు.. బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ | Australia Have Won The Toss And Choose Bat First | Sakshi
Sakshi News home page

రెండో టెస్టు.. బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

Dec 14 2018 8:00 AM | Updated on Dec 14 2018 8:01 AM

Australia Have Won The Toss And  Choose Bat First - Sakshi

టాస్‌ వేస్తోన్న టిమ్‌ పెయిన్‌

సాక్షి స్పోర్ట్స్‌: పెర్త్‌లో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి టెస్టులో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా..భారత్‌ జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయాలతో రెండో టెస్టుకు దూరమైన అశ్విన్‌, రోహిత్‌ శర్మ స్థానంలో హనుమ విహారి, ఉమేశ్‌ యాదవ్‌లకు కోహ్లి స్థానం కల్పించారు. మొదటి టెస్టులో భారత్‌ విజయం సాధించిన సంగతి తెల్సిందే. అదే ఊపులో రెండో టెస్టు గెలిచేందుకు భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.

తుది జట్లు

భారత్‌ : కేఎల్‌ రాహుల్‌, విజయ్‌, కోహ్లి(కెప్టెన్‌), పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ,  మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌యాదవ్‌ .
ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌ పెయిన్‌(కెప్టెన్‌), లైయన్‌, హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌ .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement