ఆసీస్‌పై దక్షిణాఫ్రికా విజయం
బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి విజయం సాధించింది.
ముక్కోణపు వన్డే టోర్నమెంట్
గయానా: బౌలర్లు సమష్టిగా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 47 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. బెహర్డీన్ (82 బంతుల్లో 62; 4 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీ సాధించగా.... ఆమ్లా (35), డివిలియర్స్ (22) రాణించారు. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్, హాజిల్‌వుడ్, మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా 34.2 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది.
ఫించ్ (103 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా రెండో ఎండ్ నుంచి సహకారం కరువయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా మూడు వికె ట్లు తీయగా... పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, ఫాంగిసో రెండేసి వికెట్లు సాధించారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికాకు బోనస్ పాయింట్ కూడా లభించింది.
నవంబర్‌లో డే నైట్ టెస్టు
ఆస్ట్రేలియా జట్టు మరోసారి డే నైట్ టెస్టు ఆడేందుకు రంగం సిద్ధమయింది. గతేడాది తొలిసారి న్యూజి లాండ్‌తో అడిలైడ్‌లో పింక్ బంతితో ఆడిన ఆస్ట్రేలియా... ఈసారి దక్షిణాఫ్రికాతో నవంబరు 24 నుంచి అదే అడిలైడ్‌లో డేనైట్ టెస్టు ఆడబోతోంది.


