మా ఫీల్డర్లే గెలిపిస్తారు

ఆసీస్ బ్యాట్స్‌మన్ హెడ్ ధీమా
చెన్నై: తమ జట్టులో అత్యంత నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారని, వారే భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో జట్టు విజయానికి కారణమవుతారని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రెవిస్ హెడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ఓ మ్యాచ్ గెలవాలన్నా.. ఓడాలన్నా ఫీల్డింగే కారణమవుతుంది. అయితే ఈ విషయంలో మా జట్టు గర్వపడాల్సి ఉంది. ఎందుకంటే అద్భుతమైన ఫీల్డింగ్ మా సొంతం. ఈ విషయంలో మేం చాలా కష్టపడ్డాం. తమ ఫీల్డింగ్‌తో జట్టును గెలిపించే వారు మా జట్టులో ఉన్నారు’ అని హెడ్ అన్నాడు.
ఫించ్ అనుమానమే...
ఆసీస్ పించ్ హిట్టర్ ఆరోన్ ఫించ్ తొలి వన్డేలో ఆడేది అనుమానంగా మారింది. అతడి కాలి పిక్క కండరాల నొప్పి ఎక్కువ కావడమే ఇందుకు కారణం. నెట్ ప్రాక్టీస్ సమయంలో తను గాయపడటంతో సెషన్‌కు దూరంగా ఉంచి విశ్రాంతి కల్పించారు. ఒకవేళ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే హెడ్ లేదా కార్ట్‌రైట్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి