గ‌ర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వ‌ని రాహుల్‌ | Athiya Shetty Birthday Wishes To KL Rahul | Sakshi
Sakshi News home page

గ‌ర్ల్‌ఫ్రెండ్ విషెస్‌కు రిప్లై ఇవ్వ‌ని రాహుల్‌

Apr 18 2020 3:39 PM | Updated on Apr 18 2020 3:51 PM

Athiya Shetty Birthday Wishes To KL Rahul - Sakshi

టీమిండియా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ 28వ‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి అత‌నికి వినూత్న రీతిలో శుభాకాంక్ష‌లు తెలిపింది.  అతియా శెట్టి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతుర‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అతియా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌తో క‌లిసి చిరునవ్వు చిందిస్తోన్న  ఫోటోను ఒక‌టి యాడ్ చేసింది. 'హ్యాప్పీ బ‌ర్త్‌డే మై డియ‌ర్' అని కామెంటు పెట్టి ల‌వ్ ఎమోజీని యాడ్ చేసింది. అయితే ఇంత‌కవ‌ర‌కు రాహుల్ ఆమె కామెంట్‌కు ఎలాంటి రిప్లై ఇవ్వ‌లేదు.(‘పాక్‌ క్రికెటర్లు.. చిల్లర మాటలు ఆపండి’)

గ‌త సంవ‌త్స‌రం అతియా శెట్టి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రాహుల్ ఆమెకు విషెస్ చెప్ప‌డంతో వీరిద్ద‌రి మధ్య ప్రేమ మొద‌లైంద‌ని అంతా అనుకున్నారు. ఆ వాద‌న‌ల‌కు బ‌లం చేకూరుస్తూ రాహుల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సునీల్ శెట్టి న‌టించిన హేరాపేరి సినిమాలో అత్యంత పాపుల‌ర్ అయ‌న టెలిఫోన్ స‌న్నివేశాన్ని ఇమిటేట్ చేశాడు. రాహుల్ ఫోన్ మాట్లాడుతుండ‌గా అతియా ఫోన్ ప‌క్క‌న నిలుచొని కాయిన్ వేస్తుంది. అప్పుడు రాహుల్ ఫోన్‌లో  పాపుల‌ర్ డైలాగ్ 'హ‌లో దేవీ ప్ర‌సాద్' అంటాడు. అప్ప‌ట్లో ఈ పోస్ట్ బాగా వైర‌ల్ అయింది. సంవ‌త్సరం నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న రాహుల్‌, అతియాల పెళ్లి చేసుకుంటు మాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సునీల్ శెట్టి దంప‌తులు ఇదివ‌ర‌కే పేర్కొన్నారు. 

happy birthday, my person 🤍 @rahulkl

A post shared by Athiya Shetty (@athiyashetty) on

Hello, devi prasad....?

A post shared by KL Rahul👑 (@rahulkl) on

Advertisement
 
Advertisement
Advertisement