ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్లో భారత్‌ | Asian Junior squash title qualified | Sakshi
Sakshi News home page

ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ ఫైనల్లో భారత్‌

Feb 5 2017 1:20 AM | Updated on Sep 5 2017 2:54 AM

భారత కుర్రాళ్లు తమ విజయపరంపరను కొనసాగిస్తూ ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు.

హాంకాంగ్‌: భారత కుర్రాళ్లు తమ విజయపరంపరను కొనసాగిస్తూ ఆసియా జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 2–0తో ఆతిథ్య హాంకాంగ్‌ జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో రంజిత్‌ సింగ్‌ 11–4, 5–11, 11–8, 11–6తో చాన్‌ చి హోపై నెగ్గగా... రెండో మ్యాచ్‌లో వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ 13–11, 11–13, 11–5, 8–11, 11–5తో లాయ్‌ చెయుక్‌ నామ్‌ను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. రెండో సెమీఫైనల్లో మలేసియా 2–1తో పాకిస్తాన్‌ను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. బాలికల విభాగంలో 5 నుంచి 9 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్‌ 1–2తో కొరియా చేతిలో ఓడింది.

Advertisement
 
Advertisement
Advertisement