తమ ఫస్ట్‌ నైట్‌ గురించి తెలిపిన క్రికెటర్‌ భార్య! | Ashwin wife reveals CRAZY details of their FIRST night | Sakshi
Sakshi News home page

Nov 16 2017 10:50 AM | Updated on Nov 16 2017 10:50 AM

Ashwin wife reveals CRAZY details of their FIRST night - Sakshi

క్రికెటర్‌ అశ్విన్‌ రవిచంద్రన్‌, ప్రీతి అశ్విన్‌ దంపతులు తాజాగా ఆరు వసంతాలను పూర్తిచేసుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్‌ 13న భార్య ప్రీతికి అశ్విన్‌ ట్విట్టర్‌లో ఓ స్వీట్‌ మెసేజ్‌ను పోస్టు చేశాడు. ఈ ఆరేళ్లు కష్టసుఖాల్లో తనకు తోడుగా ఉన్న ప్రీతికి థ్యాంక్స్‌ చెప్పాడు. ఇందుకు ప్రీతి లవ్లీ మెసేజ్‌తో రిప్లే ఇచ్చింది. ’యువర్‌ వెల్కమ్‌. కష్టసుఖాల్లో మనం కలిసి సాగాం. కానీ, మన వివాహం ’కిటో’లోనూ కలిసిసాగేంత దృఢమైనదని నువ్వు భావించావా’అంటూ అశ్విన్‌ ఉద్దేశించి హ్యుమర్‌ అండ్‌ విట్‌ మెసేజ్‌ను పెట్టింది.

కిటో అంటే కెటోజెనిక్‌ డైట్‌. ఇది తక్కువ కార్బన్‌ ఉన్న డైట్‌.. మనిషి ఆహారం తక్కువగా తీసుకున్నప్పుడు శరీరం కొవ్వును కరిగించి కాలేయంలోకి కీటోన్స్‌ను విడుదల చేస్తుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఆహారం తక్కువగా తీసుకున్న.. సమయంలోనూ మనిషి దృఢంగా  ఉండేందుకు పనికొస్తోంది. కష్టనష్టాల్లోనూ చెక్కుచెదరకుండా కలిసి సాగుదామన్న ఉద్దేశంతో ప్రీతి ఈ మెసేజ్‌ పెట్టింది.

ఆ తర్వా త ప్రీతి పెట్టిన మరో మెసేజ్‌ నెటిజన్స్‌ నిజంగానే స్టంపౌట్‌ చేసింది. తమ ఫస్ట్‌నైట్‌ సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రీతి అభిమానులతో పంచుకుంది. తెల్లవారే మ్యాచ్‌ ఉండటంతో తమ మొదటిరాత్రి నాడు అశ్విన్‌ను పడుకోనివ్వాలని కుటుంబసభ్యులు తనకు సూచించారట. ’యాస్‌ ఇఫ్‌’ అంటూ కొంటె ఆలోచన వచ్చేలా ప్రీతి పెట్టిన ఈ హిలేరియస్‌ మెసేజ్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ’ఆరేళ్ల కిందట ఇదే రోజు మేం కోల్‌కతాకు వెళ్లాం. తెల్లవారే మ్యాచ్‌ ఉండటంతో అతన్ని పడుకోనివ్వు అంటూ మా కుటుంబసభ్యులు నాకు సూచించారు. (మేం అలా చేయనట్టు‌).. కానీ, టీమ్‌కు సంబంధించిన రహస్య అల్లారంలు రాత్రాంతా మోగాయి. తర్వాత రోజు మేం బాటింగ్‌ చేశాం’ అని ప్రీతి సరదాగా వివరించింది. ’అది అశ్విన్‌కు తొలి టెస్ట్‌ మ్యాచ్‌. నేను ఎక్సైటింగా ఉన్నానో అంత నెర్వస్‌కు గురయ్యాను. తొలిసారి చూసినప్పుడు మైదానంలో అతన్ని గుర్తించలేకపోయాను. ఇప్పుడు అశ్విన్‌ ఏకంగా 300 వికెట్లు తీశాడు’ అని ఆనాటి అనుభవాన్ని ప్రితీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement