ప్రాక్టీస్‌ చేస్తుండగా బాణం గుచ్చుకోవడంతో..

Archer Shivangini Gohain Airlifted To AIIMS After Arrow Pierces At Neck  - Sakshi

న్యూఢిల్లీ : ఖేలో ఇండియా క్రీడల సందర్భంగా గురువారం 12 ఏళ్ల ఆర్చరీ క్రీడాకారిణి శివాంగిని గొహేన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో పారపాటుగా ఒక బాణం వచ్చి ఆమె మెడకు గుచ్చుకుంది. దీంతో ఆమెను గుహావటిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉండడంతో అక్కడి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ట్రూమా సెంటర్‌కు తరలించినట్లు స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(శాప్‌) పేర్కొంది. 'ఈరోజు(శుక్రవారం) ఉదయం 8గంటల ప్రాంతంలో శివాంగిని జాయిన్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమెను అబ్జర్వేజన్‌లో ఉంచామని, చికిత్సకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు' ఎయిమ్స్‌ మెడికల్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ అమిల్‌ లత్వాల్‌ పేర్కొన్నారు. శాయ్‌ అథారిటీ సెక్రటరీ శ్యామ్‌ జులానియా మాట్లాడుతూ.. గురువారం అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో పొరపాటున ఒక బాణం వచ్చి శివాంగిని మెడకు గుచ్చుకుంది. ఆమె పరిస్థితి కొంత విషమంగా మారడంతో ఎయిమ్స్‌ ట్రూమా సెంటర్‌కు తరలించాము.శివాంఘి కోలుకునేవరకు ఆమెకయ్యే వైద్య ఖర్చులన్నింటిని శాయ్‌ భరించనుందని స్పష్టం చేశారు. కాగా ఖేలో ఇండియా క్రీడలు ఈరోజు(జనవరి 10) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22 వరకు జరగనునన్న ఈ పోటీలు మొత్తం 20 విభాగాల్లో నిర్వహించనున్నారు. దాదాపు 6500 మంది అథ్లెట్లు అండర్‌-17, అండర్‌-21 కేటగిరీల్లో పోటీ పడనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top