అర్చన శుభారంభం | Archana started well | Sakshi
Sakshi News home page

అర్చన శుభారంభం

Dec 6 2016 1:04 AM | Updated on Sep 4 2017 9:59 PM

అర్చన శుభారంభం

అర్చన శుభారంభం

ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

కేప్‌టౌన్: ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల సింగిల్స్ విభాగంలో అర్చన కామత్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... మానవ్ వికాస్ ఠక్కర్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో అర్చన కామత్ 11-7, 11-4, 11-4, 14-12తో అనా గార్సియా (స్పెయిన్)పై గెలుపొందగా... మానవ్ 10-12, 7-11, 11-6, 11-13, 11-13తో హొరాసియో సిఫుయెంటెస్ (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement