అన్సారీకి స్వర్ణ పతకం | Ansari Wins Gold Medal In Shooting | Sakshi
Sakshi News home page

అన్సారీకి స్వర్ణ పతకం

Aug 8 2019 10:03 AM | Updated on Aug 8 2019 10:03 AM

Ansari Wins Gold Medal In Shooting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో కేఎంఏ అన్సారీ సత్తా చాటాడు. తెలంగాణ రైఫిల్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో క్లే పీజియన్‌ పురుషుల ట్రాప్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో అతను చాంపియన్‌గా నిలిచాడు. మొత్తం 8 మంది షూటర్లు ఫైనల్లో పాల్గొనగా అన్సారీ 42 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. డాక్టర్‌ సాబిర్‌ అలీ ఖాన్‌ 41 పాయింట్లతో రజతాన్ని సొంతం చేసుకోగా... అమితాభ ఇపుర్‌ 38 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నాడు.

జూనియర్‌ పురుషుల క్లే పీజియన్‌ ట్రాప్‌ షూటింగ్‌లో అహ్మద్‌ అలీ ఖాన్‌ 21 పాయింట్లతో రాణించాడు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన షూటర్లను తెలంగాణ రైఫిల్‌ సంఘం అధ్యక్షుడు అమిత్‌ సంఘి అభినందించారు. భవిష్యత్‌లో మరింతగా రాణించి దేశానికి పతకాలు అందించాలని ఆకాంక్షించారు.   

Advertisement
 
Advertisement
Advertisement