తెలంగాణకు మరో రెండు రజతాలు | Another two silver for Telangana state | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మరో రెండు రజతాలు

Feb 5 2015 12:54 AM | Updated on Aug 11 2018 7:56 PM

తెలంగాణకు మరో రెండు రజతాలు - Sakshi

తెలంగాణకు మరో రెండు రజతాలు

జాతీయ క్రీడల్లో తెలంగాణ టెన్ని స్ క్రీడాకారులు రెండు రజతాలతో సరిపెట్టుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల టీమ్ ఫైనల్లో తెలంగాణ 1-2తో తమిళనాడు చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో విష్ణువర్ధన్ 6-7, 4-6తో శ్రీరామ్ బాలాజీ చేతిలో పరాజయం చవిచూశాడు.

టెన్నిస్‌లో రన్నరప్‌తో సరి  
 ఏపీకి మరో రెండు కాంస్యాలు
 జాతీయ క్రీడలు

 
 తిరువనంతపురం:
జాతీయ క్రీడల్లో తెలంగాణ టెన్ని స్ క్రీడాకారులు రెండు రజతాలతో సరిపెట్టుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల టీమ్ ఫైనల్లో తెలంగాణ 1-2తో తమిళనాడు చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో విష్ణువర్ధన్ 6-7, 4-6తో శ్రీరామ్ బాలాజీ చేతిలో పరాజయం చవిచూశాడు. రెండో సింగిల్స్‌లో సాకేత్ మైనేని 7-5, 4-6, 7-6తో రామ్‌కుమార్ రామనాథన్‌పై నెగ్గాడు.
 
 
 అయితే పురుషుల డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ-జీవన్ నెడుంచెలియాన్ 6-1, 6-4తో విష్ణు వర్ధన్-సాకేత్‌లపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మహిళల టీమ్ ఫైనల్లో తెలంగాణ 0-2తో గుజరాత్ చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో సౌజన్య భవిశెట్టి 7-5, 4-6, 4-6తో ఇతి మెహతా చేతిలో; రెండో సింగి ల్స్‌లో నిధి చిలుముల 3-6, 1-6తో అంకితా రైనా చేతిలో ఓడారు. ప్రస్తుతం తెలంగాణ ఖాతాలో ఐదు రజతాలు, ఓ కాంస్యం ఉన్నాయి.
 
 మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రెండు కాంస్యాలు దక్కాయి. వెయిట్ లిఫ్టింగ్ 69 కేజీల విభాగంలో గారా అరుణ రాణి 190 (క్లీన్ 85+జర్క్ 105) కేజీల బరువు ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ వ్యక్తిగత విభాగంలో మేఘన గుండాల్‌పలి కాంస్యం సాధించింది. ప్రస్తుతం ఏపీ ఖాతాలో ఓ స్వర్ణం, ఓ రజతం, 4 కాంస్యాలున్నాయి.  
 
 విజయ్‌కు మరో రెండు పతకాలు
 సర్వీసెస్ షూటర్ విజయ్ కుమార్‌కు మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో విజయ్, గురుప్రీత్, ఓంకార్ సింగ్‌ల బృందానికి స్వర్ణం లభించింది. అయితే వ్యక్తిగత విభాగంలో విజయ్ (565) కాంస్యంతో సంతృప్తిపడ్డాడు. స్క్వాష్‌లో తమిళనాడుకు రెండు పసిడి పతకాలు దక్కాయి. మహిళల ఫైనల్లో జోత్స్న చినప్ప 11-5, 11-8, 11-4తో లక్ష్యపై; పురుషుల టైటిల్ పోరులో సౌరవ్ ఘోషాల్ 4-11, 11-4, 11-8, 11-6తో హరీందర్ పాల్ సింగ్ సంధుపై నెగ్గారు.
 
 రెజ్లింగ్‌లో హరియాణాకు 18 స్వర్ణాలు
 జాతీయ క్రీడల రెజ్లింగ్‌లో హరియాణా నాలుగో రోజు ఐదు స్వర్ణాలు గెలిచి... ఈ విభాగంలో మొత్తం 18 పసిడి పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా పతకాల పట్టికలో హరియాణా 21 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో 33 పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉంది.
 
 మోహన్‌లాల్ ప్రతిపాదనను తిరస్కరించిన కేరళ ప్రభుత్వం
 తిరువనంతపురం: జాతీయ క్రీడల ప్రారంభ వేడుకలకు సంబంధించి తాను తీసుకున్న డబ్బులను వెనక్కి  ఇచ్చేస్తానని మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చేసిన ప్రతిపాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరించింది. ఆయన ప్రతిపాదనను తాము ఆమోదించలేమని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ అన్నారు. ఈవెంట్‌పై క్యాబినెట్ సమావేశంలో సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement