భారత్‌తో తొలి టెస్టుకు అండర్సన్ దూరం | Anderson distance to the first Test against India | Sakshi
Sakshi News home page

భారత్‌తో తొలి టెస్టుకు అండర్సన్ దూరం

Oct 20 2016 1:42 AM | Updated on Sep 4 2017 5:42 PM

భారత్‌తో తొలి టెస్టుకు అండర్సన్ దూరం

భారత్‌తో తొలి టెస్టుకు అండర్సన్ దూరం

వచ్చే నెల 9 నుంచి భారత్‌తో జరిగే తొలి టెస్టుకు తమ ప్రధాన బౌలర్ అండర్సన్ అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ చెప్పాడు.

లండన్: వచ్చే నెల 9 నుంచి భారత్‌తో జరిగే తొలి టెస్టుకు తమ ప్రధాన బౌలర్ అండర్సన్ అందుబాటులో ఉండటం లేదని ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ చెప్పాడు. ఎడమ భుజం గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అండర్సన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లు కూడా ఆడటం లేదు. భారత్‌లో తను తమ జట్టుతో చేరతాడని కుక్ తెలిపాడు. బంగ్లాదేశ్‌తో నేటి నుంచి జరిగే తొలి టెస్టు ద్వారా కుక్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు (134) ఆడిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించబోతున్నాడు. 

 

హాట్ కేకుల్లా చాంపియన్‌‌సట్రోఫీ టిక్కెట్లు
వచ్చే ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే ఐసీసీ చాంపియన్‌‌స ట్రోఫీని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 4.17 లక్షల టికెట్ల కోసం 60 దేశాలకు చెందిన అభిమానులు నమోదు చేసుకున్నారని ఐసీసీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement