ముంబై స్కోరు 129...టీవీ కట్టేసిన అమితాబ్‌ | Amitabh Bachchan switched off his TV half way through the IPL final | Sakshi
Sakshi News home page

ముంబై స్కోరు 129...టీవీ కట్టేసిన అమితాబ్‌

May 23 2017 1:32 AM | Updated on Sep 5 2017 11:44 AM

ముంబై స్కోరు 129...టీవీ కట్టేసిన అమితాబ్‌

ముంబై స్కోరు 129...టీవీ కట్టేసిన అమితాబ్‌

ఆయన ఓ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌. భారత క్రికెట్‌కు ‘బిగ్‌’ ఫ్యాన్‌. ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌ వీరాభిమాని. కానీ ఆదివారం ఫైనల్లో ముంబై ఇండియన్స్‌

ముంబై: ఆయన ఓ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌. భారత క్రికెట్‌కు ‘బిగ్‌’ ఫ్యాన్‌. ఐపీఎల్‌లో మాత్రం ముంబై ఇండియన్స్‌ వీరాభిమాని. కానీ ఆదివారం ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేసిన స్కోరుతో తన అభిమాన జట్టు ఓడిపోతుందని నిరాశగా టీవీ కట్టేశారు. కానీ తన కుమారుడు ఫోన్‌ చేసి ముంబై గెలించిందనేసరికి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. ఆయనే బాలీవుడ్‌ ‘బిగ్‌–బి’ అమితాబ్‌ బచ్చన్‌.

 ముంబై 20 ఓవర్లలో చేసిన 129 పరుగుల స్కోరు సీనియర్‌ బచ్చన్‌కు రుచించలేదు. అందుకే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తర్వాత కట్టేసిన టీవీవైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. కానీ అభిషేక్‌ బచ్చన్‌ సమాచారంతో సంతోషించిన ఆయన ట్విట్టర్‌లో ఆ అనుభూతిని డైలాగ్‌తో పంచుకున్నారు. ‘తుమ్‌ అపున్‌ కో దస్‌ మారా. అపున్‌ ఏక్‌ మారా... పర్‌ సాలిడ్‌ మారా’ (మీరు మమ్మల్ని పదిసార్లు కొట్టారు. కానీ మేం ఒక్కసారే మిమ్మల్ని కొట్టాం. అదరగొట్టాం) అని పోస్ట్‌ చేశారు అమితాబ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement