తొలి స్వర్ణం అమెరికాదే | America won first gold medal | Sakshi
Sakshi News home page

తొలి స్వర్ణం అమెరికాదే

Feb 9 2014 12:51 AM | Updated on Oct 5 2018 9:09 PM

సోచి వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో తొలి స్వర్ణం అమెరికాకు దక్కింది. పురుషుల స్నోబోర్డు స్లోప్‌స్టైల్‌లో కొత్సెన్‌బర్గ్ 93.50 పాయింట్లతో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు.

 క్రాన్‌స్నాయా పోల్యానా (రష్యా): సోచి వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో తొలి స్వర్ణం అమెరికాకు దక్కింది. పురుషుల స్నోబోర్డు స్లోప్‌స్టైల్‌లో కొత్సెన్‌బర్గ్ 93.50 పాయింట్లతో విజేతగా నిలిచి పసిడి పతకాన్ని అందుకున్నాడు.
 
 అమెరికా టాప్ అథ్లెట్ జాన్ వైట్ మరో టోర్నీపై దృష్టి నిలపడం కోసం ఈ పోటీలకు దూరమైనా... కొత్సెన్‌బర్గ్ అనూహ్యరీతిలో స్వర్ణం సాధించి ఆ లోటును పూడ్చాడు. బయాథ్లాన్ స్ప్రింట్ 10 కిలోమీటర్ల విభాగంలో బోజెర్న్‌డాలెన్ (నార్వే) స్వర్ణం నెగ్గాడు. ఈ క్రమంలో అతను వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 12 పతకాలు నెగ్గిన క్రీడాకారుడిగా జాన్ డెలీ (నార్వే) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement