
రహానే (44) అవుట్
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 36.2 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 36.2 ఓవర్లలో 178 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. అజ్యింకా రహానే(44) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.. ఆసీస్ విసిరిన 329 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 108 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. సురేష్ రైనా(7), రోహిత్ శర్మ(34) , విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) లు పెవిలియన్ కు చేరారు. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ(36), రవీంద్ర జడేజా(0) లు క్రీజ్ లో ఉన్నారు.