తొలిరౌండ్‌లో జీవితేశ్‌ గెలుపు | All India Chess Tourney Jeevitesh Start With Wins | Sakshi
Sakshi News home page

తొలిరౌండ్‌లో జీవితేశ్‌ గెలుపు

Oct 2 2019 10:17 AM | Updated on Oct 2 2019 10:17 AM

All India Chess Tourney Jeevitesh Start With Wins - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత ఫిడే రేటింగ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) సాయి అగ్ని జీవితేశ్‌ శుభారంభం చేశాడు. ప్రుఫర్‌ లాజిక్‌ అండ్‌ స్ఫూర్తి చెస్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ గేమ్‌లో తెలంగాణకే చెందిన పి. శశిధర్‌పై జీవితేశ్‌ గెలుపొందాడు. ఇతర బోర్డుల్లో మాధవ చిట్ట (తెలంగాణ)పై పి. భరత్‌ కుమార్‌ రెడ్డి (తెలంగాణ), ఎస్‌. నరసింగా రావుపై వి. వరుణ్‌ (తెలంగాణ), అర్పిత (తెలంగాణ)పై ప్రవీణ్‌ ప్రసాద్, జి. వీణ (తమిళనాడు)పై కౌస్తుభ్‌ కుందు (పశ్చిమ బెంగాల్‌) విజయం సాధించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన మొత్తం 282 మంది క్రీడాకారులు తలపడతున్నారు. స్విస్‌ లీగ్‌ పద్ధతిలో 9 రౌండ్ల పాటు పోటీలు జరుగుతాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement