‘ఆల్‌ ఇంగ్లండ్‌’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్‌ | 'All England' as the observer Chamundeshwari | Sakshi
Sakshi News home page

‘ఆల్‌ ఇంగ్లండ్‌’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్‌

Feb 18 2017 12:12 AM | Updated on Sep 5 2017 3:57 AM

‘ఆల్‌ ఇంగ్లండ్‌’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్‌

‘ఆల్‌ ఇంగ్లండ్‌’ పరిశీలకుడిగా చాముండేశ్వరీనాథ్‌

తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్‌కు అరుదైన అవకాశం దక్కింది.

హైదరాబాద్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు వి. చాముండేశ్వరీనాథ్‌కు అరుదైన అవకాశం దక్కింది. వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ‘ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీ’కి ఆయన భారత జట్టు తరఫున పరిశీలకుడిగా నియమితులయ్యారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) చాముండికి ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి 11 మంది షట్లర్లు పాల్గొంటున్నారు.

మార్చి 7 నుంచి 12 వరకు బర్మింగ్‌హామ్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. మాజీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్‌ అయిన చాముండి ప్రస్తుతం హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఇంగ్లండ్‌లోనే జరిగిన 2009 టి20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement