దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్ | Akshar Patel, Suryakumar Yadav power West Zone into final | Sakshi
Sakshi News home page

దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్

Dec 2 2014 12:33 AM | Updated on Sep 2 2017 5:28 PM

దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్

దేవధర్ ఫైనల్లో వెస్ట్‌జోన్

అక్షర్ పటేల్ (38 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 80; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... దేవధర్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్‌కు చేరింది.

ముంబై: అక్షర్ పటేల్ (38 బంతుల్లో 64 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 80; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో... దేవధర్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టు ఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన సెమీఫైనల్లో వెస్ట్ 2 వికెట్లతో సౌత్‌జోన్‌ను ఓడించింది. టాస్ గెలిచిన వెస్ట్ ఫీల్డింగ్ ఎంచుకోగా... సౌత్‌జోన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 314 పరుగులు చేసింది. మయాంక్ (86), అపరాజిత్ (56), మనీష్ పాండే (55) అర్ధసెంచరీలు చేశారు.

వెస్ట్‌జోన్ జట్టు 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 319 పరుగులు చేసి నెగ్గింది. జాక్సన్ (51), రాయుడు (54) అర్ధసెంచరీలు చేశారు. 174 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న వెస్ట్‌జోన్‌ను... అక్షర్, సూర్యకుమార్ కలిసి గట్టెక్కించారు. బుధవారం జరిగే ఫైనల్లో వెస్ట్‌జోన్, ఈస్ట్‌జోన్ తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement