కెన్యాతో రెండు వన్డేలకు అజ్మల్ | Ajmal to play against Kenya before biomechanics test: PCB | Sakshi
Sakshi News home page

కెన్యాతో రెండు వన్డేలకు అజ్మల్

Dec 12 2014 12:26 AM | Updated on Sep 2 2017 6:00 PM

కెన్యాతో రెండు వన్డేలకు అజ్మల్

కెన్యాతో రెండు వన్డేలకు అజ్మల్

తమ నిషేధిత స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను... చెన్నైలో బయోమెకానిక్ పరీక్షకు పంపడానికి ముందు కెన్యాతో జరిగే చివరి రెండు వన్డేల్లో బరిలోకి దించాలని పీసీబీ నిర్ణయించింది.

ఆ తర్వాతే బయోమెకానిక్ పరీక్ష
 కరాచీ: తమ నిషేధిత స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను... చెన్నైలో బయోమెకానిక్ పరీక్షకు పంపడానికి ముందు కెన్యాతో జరిగే చివరి రెండు వన్డేల్లో బరిలోకి దించాలని పీసీబీ నిర్ణయించింది. ‘ఇది ప్రతినిధుల సిరీస్ మాత్రమే. దీనికి అంతర్జాతీయ గుర్తింపు లేదు. కాబట్టి కెన్యాతో చివరి రెండు మ్యాచ్‌ల్లో అజ్మల్‌ను ఆడిస్తాం.
 
 అలాగే లాహోర్‌లో జరిగే ఒకటి, రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కూడా బరిలోకి దించుతాం’ అని పీసీబీ అధికారి షకీల్ షేక్ వెల్లడించారు. మరో స్పిన్నర్ హఫీజ్ మాత్రం బయోమెకానిక్ పరీక్ష కోసం ఈ వారంలో దుబాయ్ నుంచి నేరుగా చెన్నైకి వెళ్తాడన్నారు. వీసా కోసం వేచి చూస్తున్నామన్నారు. అయితే అజ్మల్ అధికారిక బయోమెకానిక్ పరీక్ష కోసం డిసెంబర్ 30న చెన్నైకి వెళ్లే అవకాశం ఉందని షకీల్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement