'నన్ను దాటిన ధోనికి అభినందనలు' | Adam Gilchrist's Special Message For MS Dhoni | Sakshi
Sakshi News home page

'నన్ను దాటిన ధోనికి అభినందనలు'

Jul 4 2017 3:51 PM | Updated on Sep 5 2017 3:12 PM

'నన్ను దాటిన ధోనికి అభినందనలు'

'నన్ను దాటిన ధోనికి అభినందనలు'

తన రికార్డును అధిగమించిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ అభినందనలు తెలియజేశాడు.

సిడ్నీ:తన రికార్డును అధిగమించిన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఆడమ్ గిల్ క్రిస్ట్ అభినందనలు తెలియజేశాడు. గత రెండు రోజుల క్రితం వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో ధోని (54) హాఫ్ సెంచరీ నమోదు చేసి ఈ ఫార్మాట్ లో 9,496 పరుగుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, అంతకుముందు జరిగిన మూడో వన్డేల్లో ధోని 78 పరుగులు చేసి ఆడమ్ గిల్ క్రిస్ట్(9,410 పరుగులు) రికార్డును బధ్దలు కొట్టాడు.

అయితే నాల్గో వన్డే తరువాత ధోనికి ప్రత్యేక మెసేజ్ ద్వారా గిల్లీ అభినందలు తెలియజేశాడు. 'నన్ను దాటిన ధోనికి అభినందనలు. యువ ధోని ఎప్పుడూ ప్రత్యేకమే' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు ఇరువురు ఐపీఎల్లో కెప్టెన్లుగా ఉన్న నాటి ఫోటోను జత చేశాడు. ఇక్కడ శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా(14,234) తొలిస్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement