ఆసీస్ బౌలర్‌పై నటి కామెంట్! | Sakshi
Sakshi News home page

ఆసీస్ బౌలర్‌పై నటి కామెంట్!

Published Tue, Mar 14 2017 6:55 PM

ఆసీస్ బౌలర్‌పై నటి కామెంట్!

ముంబై: ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్‌ చర్యను తప్పుపడుతూ టీమిండియాకు నటి సయామీ ఖేర్ మద్దతు తెలిపింది. బెంగళూరు టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన ఔట్ సమయంలో డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ నిర్ణయం కోసం ఎదురుచూడటం.. ఆపై అది వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమ కెప్టెన్ స్మిత్‌కు స్టార్క్ మద్దతు తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నటి సయామీ ఖేర్ సోషల్ మీడియాలో స్పందించింది. 'తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టున్నావ్.. అందుకే రెండో టెస్టులో గాయపడ్డావు. దీంతో ఏకంగా సిరీస్ నుంచే ఇంటిబాట పట్టావు' అని పేర్కొంటూ మిచెల్ స్టార్క్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హ్యాష్ ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది.

నటి సయామీ చేసిన పోస్టుకు మంచి స్పందన వస్తోంది. కోహ్లీసేనతో పెట్టుకుంటే అంతే సంగతని, భారత్‌పై పైచేయి సాధించడానికి ఎక్కువగా శ్రమిస్తే ప్రత్యర్థి బౌలర్లకు ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు గాయం కారణంగా మిచెల్ మార్ష్‌ కూడా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత్, ఆసీస్‌లు 1-1తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టు రాంచీలో జరగనుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement