సెమీస్‌లో అభిరామ్, శ్రీకర్‌ | Abhiram, Srikar in Semis of Badminton Championship | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అభిరామ్, శ్రీకర్‌

Jun 28 2019 2:03 PM | Updated on Jun 28 2019 2:03 PM

Abhiram, Srikar in Semis of Badminton Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో కె. అభిరామ్‌ రెడ్డి, బి. శ్రీకర్‌ రెడ్డి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. యూసుఫ్‌గూడ కేవీబీఆర్‌ స్టేడియంలో గురువారం జరిగిన అండర్‌–13 బాలుర సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో అభిరామ్‌ రెడ్డి 22–20, 21–19తో అభినవ్‌ గార్గ్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీకర్‌ రెడ్డి 26–24, 18–21, 21–11తో సాయి శ్రేయాన్‌‡్షపై, శుభ్‌ కుమార్‌ 21–19, 21–16తో అభిషేక్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్నారు.

డబుల్స్‌ విభాగంలో అభిరామ్, శ్రీకర్‌ జతగా సెమీస్‌కు చేరుకున్నారు. బాలుర డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో శ్రీకర్‌ రెడ్డి–అభిరామ్‌ రెడ్డి ద్వయం 21–13, 21–7తో అభిషేక్‌–వరుణ్‌ తేజ్‌ జోడీపై, అభిషేక్‌–సాయి శ్రేయస్‌ జంట 21–9, 21–12తో రాహుల్‌–రోహన్‌ జోడీపై, రామ్‌–సుబ్బు జోడీ 17–21, 21–8, 21–13తో యశ్‌వర్ధన్‌–సాయి సిద్ధార్థ్‌ ద్వయంపై, అభినవ్‌–మానవ్‌ ద్వయం 21–17, 13–21, 21–18తో వంశీకృష్ణ–జిష్ణు తేజ్‌ జంటపై గెలుపొంది సెమీఫైనల్లో అడుగుపెట్టాయి.

Advertisement
 
Advertisement
Advertisement