చాంపియన్‌ అభిరామ్‌ ప్రణీత్‌

Abhiram Praneeth Wins Chess Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిలియంట్‌ ట్రోఫీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తక్షశిల పబ్లిక్‌ స్కూల్‌ (లాలాపేట్‌) విద్యార్థి అభిరామ్‌ ప్రణీత్, జేకే రాజు చాంపియన్‌లుగా నిలిచారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన ఈ టోర్నీ జూనియర్స్‌ కేటగిరీలో నిర్ణీత 6 రౌండ్లకు గానూ 6 పాయింట్లు సాధించిన అభిరామ్‌ ప్రణీత్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన చివరి గేమ్‌లో ఆరుష్‌పై ప్రణీత్‌ గెలుపొందాడు. 5 పాయింట్లతో కోవిద్‌ కుశాల్‌ రన్నరప్‌గా నిలవగా... ఆలకంటి విశ్వ మూడోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఓపెన్‌ కేటగిరీలో 5.5 పాయింట్లు స్కోర్‌ చేసిన జేకే రాజు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. అమిత్‌పాల్‌ సింగ్‌ (5 పాయింట్లు), షణ్ముఖ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీలో జాహ్నవి శ్రీలలిత ‘బెస్ట్‌ ఉమన్‌’, ఎం. రామ్మోహన్‌ రావు ‘బెస్ట్‌ వెటరన్‌’ అవార్డులను గెలుచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్‌ విజేతలకు ట్రోఫీలను అందజేశారు.  

ఇతర వయో విభాగాల విజేతల వివరాలు
అండర్‌–14 బాలురు: 1. శ్రీయాన్‌ రెడ్డి, 2. జె. శ్రీరామ్‌; బాలికలు: 1. కె. సాత్విక.  
అండర్‌–12 బాలురు: 1. కోవిద్‌ కుషాల్, 2. విశ్వ; బాలికలు: 1. కె. తన్మయి, భవిష్య రెడ్డి.
అండర్‌–10 బాలురు: 1. వి. అభిరామ్, 2. సత్య పృథ్వీ; బాలికలు: 1. జి. శరణ్య, 2. రిమితా రెడ్డి.
అండర్‌–8 బాలురు: 1. ధ్రువ్, 2. శ్రీ రేవంత్‌ కుమార్‌; బాలికలు: 1. ఐశ్వర్య, 2. అనయా.
అండర్‌–6 బాలురు: 1. ఎం. గురుదేవ్, 2. హర్‌తేజ్‌పాల్‌ సింగ్‌; బాలికలు: 1. ఎన్‌. హరిణి.

, ,

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top