లలిత్‌కు మూడో గెలుపు | 3rd Kolkata International Open Grandmasters Chess Tournament | Sakshi
Sakshi News home page

లలిత్‌కు మూడో గెలుపు

May 21 2018 4:52 AM | Updated on May 21 2018 4:52 AM

3rd Kolkata International Open Grandmasters Chess Tournament - Sakshi

కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు మూడో విజయం నమోదు చేశాడు. నితిన్‌ (రైల్వేస్‌)తో ఆదివారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన లలిత్‌ 34 ఎత్తుల్లో గెలుపొందాడు. రత్నాకరన్‌ (భారత్‌)తో జరిగిన మరో గేమ్‌లో తెలంగాణ ప్లేయర్‌ ఎరిగైసి అర్జున్‌ 42 ఎత్తుల్లో విజయం సాధించాడు. హర్ష భరతకోటి, రవితేజ మధ్య జరిగిన గేమ్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఏడో రౌండ్‌ తర్వాత లలిత్, అర్జున్‌ 5.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement