కేకేఆర్‌, ​ముంబైల సరసన..

3 Teams finishing second in league phase lifting IPL title - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో సీఎస్‌కే ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది. ఫలితంగా మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచి ముంబై ఇండియన్స్‌ సరసన చెన్నై నిలిచింది. కాగా, లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్‌ ట్రోఫీని అందుకోవడం చెన్నైకు ఇది రెండోసారి. అంతకుముందు 2011 ఐపీఎల్‌లో లీగ్‌ దశలో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచింది.

ఇదిలా ఉంచితే, ఇలా లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచి ఐపీఎల్‌ టైటిల్స్‌ను రెండుసార్లు గెలిచిన జట్ల జాబితాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు మాత్రమే ఉన్నాయి. 2012, 2014లో కేకేఆర్‌ లీగ్‌ దశలో రెండో స్థానంలో నిలిచి టైటిల్స్‌ను సాధించగా, 2013, 2015 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ కూడా ఇదే తరహాలో ట్రోఫీలు సొంతం చేసుకుంది. తాజాగా సీఎస్‌కే టైటిల్‌ను కైవం చేసుకోవడంతో కేకేఆర్‌, ముంబై ఇండియన్స్‌ల సరసన నిలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top