2019లో జరగబోయే ఆసియా క్రీడలను నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సిద్ధమయ్యింది. అధికారికంగా ఈ గేమ్స్ బిడ్డింగ్‌ను దక్కించుకున్న వియత్నాం
నిర్వహణకు సిద్ధమంటూ ఐఓఏకు లేఖ
న్యూఢిల్లీ: 2019లో జరగబోయే ఆసియా క్రీడలను నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సిద్ధమయ్యింది. అధికారికంగా ఈ గేమ్స్ బిడ్డింగ్‌ను దక్కించుకున్న వియత్నాం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆతిథ్య హక్కులను ఉపసంహరించుకుంది. దీంతో ఆసియా గేమ్స్ నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ఐఓఏ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియాకు లేఖ రాసింది.
‘ఢిల్లీ పేరిట 18వ ఆసియా గేమ్స్ నిర్వహణకు బిడ్డింగ్‌ను సమర్పించాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా మీకు తెలుపుతున్నాం’ అని ఓసీఏ చీఫ్ షేక్ అహ్మద్‌కు పంపిన లేఖలో ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నారు. ఓసీఏ బిడ్ డ్యాక్యుమెంట్స్ తమకు పంపాక కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు.