తెలుగులో రీమేక్‌ చేయాలనుంది

Oru Nalla Naal Paathu Solren director comments on ram charan - Sakshi

తమిళసినిమా: ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్‌ చిత్ర కన్టెంట్‌ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని, అందుకే ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్‌ చేమాలన్న ఆలోచన ఉందని ఆ చిత్రం దర్శక, నిర్మాత ఆరుముగకుమార్‌ తెలిపారు. 7సీ.ఎంటర్‌టైయిన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ, అమ్మె నారాయణ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, గౌతమ్‌కార్తీక్, నటి గాయత్రి, నిహారిక హీరోహీరోయిన్లుగా నటించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఆరుముగకుమార్‌ చిత్రం గురించి తెలుపుతూ ఒరు నల్లనాళ్‌ పాత్తు పొల్రేన్‌ గురించి మీడియాల్లో రకరకాల ప్రచారం జరుగుతోందన్నారు. ఇది బ్లాక్‌ కామెడీ చిత్రం అని, డార్క్‌ కామెడీ చిత్రం అని, ట్రైబల్‌ నేపధ్యంలో సాగే కథా చిత్రం అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. అయితే ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్‌ చిత్రం మంచి వినోదభరిత కథా చిత్రం అని తెలిపారు. ఒక దొంగల ముఠా ఇతివృత్తంగా చిత్రం ఉంటుందని చెప్పారు.

విజయ్‌సేతుపతిది అతిథి పాత్ర కాదు
ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోందని, చిత్ర కథంతా విజయ్‌సేతుపతి చుట్టూనే తిరుగుతుందని తెలిపారు. అందులో ఇక భాగంగా నటుడు గౌతమ్‌కార్తీక్‌ పాత్ర వస్తుందని చెప్పారు. ఈ చిత్ర కథ నిహారికతో మొదలవుతుందని, నటి గాయత్రి కథను ముగిస్తుందని తెలిపారు.

తెలుగులో రీమేక్‌ చేయాలనుంది
ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్‌ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే కన్టెంట్‌ ఉందని, అందువల్ల తెలుగులో రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. ఇందులో రామ్‌చరణ్‌ లాంటి నటుడు నటిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని దర్శక,నిర్మాత ఆరుముగకుమార్‌ వ్యక్తం చేశారు.

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top