కమల్‌తో జోడి కుదిరినట్టేనా? | nayantara in kamal hassan indian-2 movie? | Sakshi
Sakshi News home page

కమల్‌తో జోడి కుదిరినట్టేనా?

Feb 1 2018 8:00 AM | Updated on Feb 1 2018 8:00 AM

nayantara in kamal hassan indian-2 movie? - Sakshi

నయనతార ,కమలహాసన్‌

తమిళసినిమా: విశ్వనటుడు కమలహాసన్‌ ఒక పక్క రాజకీయపార్టీ ప్రారంభ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, మరో పక్క సినిమాలతోనూ బిజీ అవుతున్నారు. ఈనెల 21న పార్టీ పేరు, గుర్తును ప్రకటించడానికి కార్యోణ్ముఖుడవుతున్నారు. అదే సమయంలో తాను స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం–2 చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ తరువాత సగం వరకూ చిత్రీకరణను పూర్తి చేసిన శభాష్‌నాయుడు చిత్రంపై దృష్టిసారించనున్నారట. అంతే కాదు శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 (భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌)లో నటించడానికి రెడీ అవుతున్నారు.

ఇండియన్‌ చిత్రంలో అవినీతిపై అవిశ్రాంత పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించిన కమలహాసన్‌ సీక్వెల్‌లోనూ అవనీతిపై పోరాడే పాత్రలోనే నటించనున్నారట. అయితే ఇందులో ఆయన గెటప్‌ ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రజనీకాంత్‌ హీరోగా 2.ఓ చిత్రా నిర్మాణంతర కాక్యక్రమాలతో బిజీగా ఉన్న శంకర్‌ ఇటీవల తైవాన్‌ నగరంలో ఇండియన్‌–2 పోస్టర్‌తో భారీ బెలూన్‌ను ఎగురవేసి ఆ చిత్రంపై మరింత అటెన్షన్‌ను తీసుకొచ్చారు. 2.ఓ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌నే ఇండియన్‌–2 చిత్రాన్ని నిర్మించనుందట. ఇది ఇంతకు ముందు కమల్‌ నటించిన చిత్రాలన్నిటి కంటే అత్యధిక భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్నట్లు సమాచారం.

నాయకిగా నయన్‌?
ఇందులో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా అగ్రనటి నయనతార నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆమెను నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయని టాక్‌. అంతే కాదు ఇందులో నయనతార విప్లవ నారిగా నటించనున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇదే గనుక నిజం అయితే కమల్‌తో నయన్‌ నటించే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇండియన్‌–2 చిత్రంలో వైగైపులి వడివేలు హాస్యభూమికను పోషించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెడువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement