మేం నిన్ను ఎన్నుకుంటాం..

Opinion In Social media - Sakshi

బడ్జెట్‌
‘‘ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అన్ని నియమాలకు, పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధం. ఐదేళ్లపాటు కొనసాగే ప్రభుత్వ పదవీకాలం ఈ ఏడాది మే నెలతో ముగుస్తుంది. ప్రభుత్వం ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను, ఒక ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెట్టగలదు. మూడు నెలల గడువు పెట్టుకుని ఏకంగా సంవత్సరానికి సరిపడ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం సరికాదు’’ – ఆనంద్‌ శర్మ, రాజ్యసభ ఎంపీ

జపం
‘‘ప్రియాంకా గాంధీ గేమ్‌ చేంజర్‌ కానట్టయితే పొద్దుటి నుండీ అన్ని టీవీ చానళ్లూ, బీజేపీ ప్రతినిధులు ఆమె పేరు ఎందుకు జపిస్తున్నట్టు? కనీసం ఆమె ప్రస్తుతం మన దేశంలో లేదు, ఇప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయినా, అందరూ ఎందుకంత బెంబేలెత్తుతున్నారు?’’ – అశోక్‌ స్వైన్, ప్రొఫెసర్‌

ప్రజా గొంతు
‘‘నిన్న రాత్రి అనేకమందిని కలిశా. ‘మేం నిన్ను ఎన్నుకుంటాం. మళ్లీ మా దగ్గరకు వచ్చి మా అవస రాలు తీరుస్తావని మాకు తెలుసు’ అని ఓ తల్లి అరిచి చెప్పింది. ఎంతో ప్రేమ, నమ్మకం.. మరెంతో ఆశ. పార్లమెంట్‌లో ప్రజా గొంతు వినిపించాలన్న నా సంకల్పం రోజురోజుకూ బలోపేతం అవుతోంది’’ – ప్రకాష్‌ రాజ్, సినీ నటుడు

భవిష్యత్‌
‘‘ఐక్యతా విగ్రహం కోసం మూడు వేల కోట్లు, కుంభ మేళాకేమో రూ. 4,236 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి, చిన్నారులకు వేయాల్సిన పోలియో వ్యాక్సిన్‌ కోసం డబ్బులు కేటా యించడానికి వచ్చేసరికి రూ. 280 కోట్ల లోటు బడ్జెట్‌ గుర్తొస్తుంది. ఇక చిన్నారుల భవిష్యత్‌ను కాపాడేదెవరు?’’ – జిగ్నేష్‌ మేవానీ, ఎమ్మెల్యే

గోరక్షణ 
‘‘ఉజ్వలమైన మన ప్రజాస్వామ్య దేశంలో ఇది కేవలం మరో మామూలు రోజు మాత్రమే. హరియాణాలోని రోహ్‌తక్‌ సమీపంలో భలౌట్‌ గ్రామం దగ్గర పశువులను విక్రయించే నౌషద్‌ మహ్మద్‌ అనే 24 ఏళ్ల కుర్రాడిని గోరక్షకులు రెండుగంటలపాటు చితకబాదారు. రక్తమోడుతూ, ఒళ్లంతా గాయాలతో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకుపోకుండా, స్టేషన్‌కు తీసుకువెళ్లి గొలుసుతో కట్టిపడేశారు’’  – రాణా అయూబ్, జర్నలిస్ట్‌ 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top