హమ్మయ్య..మీరు క్షేమంగా ఉన్నారు!

Man Nearly Gets Struck By Lightning In South Carolina - Sakshi

వర్షం వస్తే చాలు ఆకాశంలో మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడటం సహజమే. అయితే ఆ సమయంలో చెట్ల కింద కాని ఎత్తైన వాటి కింద ఉండొద్దని పెద్దవాళ్లు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లోనే  పిడుగులు, మెరుపులు పడే ప్రమాదం ఎక్కవ కాబట్టి. కానీ వాటిని పెడచెవిన పెట్టి ఎమౌతుందిలే అని అనుకునే వాళ్లు ఈ దృశ్యాన్ని తప్పక చూడాల్సిందే. వర్షంలో బయటకు వెళ్లిన ఓ వ్యక్తిపై ఒక్కసారిగా ‘మెరుపు దాడి’ చేయడంతో షాక్‌ గురయ్యాడు. ఈ భయానకమైన అరుదైన దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు... దక్షిణ కరోలీనాకు చెందిన రోములస్ మెక్‌నీల్  గొడుగుతో వర్షంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా తనపైకి మెరుపు రావడంతో ఉలిక్కిపడిన సంఘటన అక్కడి కెమరాలలో రికార్డు అయ్యింది. 

‘నేను ఓ భయానక సంఘటనను ఎదుర్కొన్నాను కానీ ఈ ఘటనలో నాకు పెద్దగా గాయాలేమి కాలేదంటూ’ మెక్‌నీల్‌ తన ఫేస్‌బుక్‌లో ‘మెరుపుదాడి’కి సంబంధించిన వీడియో, ఫోటోలు షేర్‌ చేశాడు. దీంతో వీడియో చూసిన నెటిజన్లంతా షాక్‌కి గురై.. కామెంట్స్‌ రూపంలో మెక్‌నీల్‌పై సానుభూతి తెలుపుతున్నారు. ‘హమ్మయ్య మీకు ఏమి జరగలేదు సంతోషం’, ‘మీరు చాలా అదృష్టవంతులు రోమ్‌ పెద్దగా గాయపడలేదు.. కానీ ఇలాంటి సమయంలో అందరు బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి’ అని  కొంతమంది కామెంట్స్‌ పెడుతుంటే మరికొందరు ‘ఇప్పుడు నువ్వు లాటరీ టిక్కెట్‌ కొనుక్కోవాలి’ అంటూ సరదా కామేంట్స్‌ పెడుతున్నారు.  

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top