బాలికపై లైంగిక దాడి | sexual assault of a minor girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Mar 18 2018 11:25 AM | Updated on Aug 21 2018 9:20 PM

sexual assault of a minor girl - Sakshi

కాచిగూడ: మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కాచిగూడ ఏసీపీ జోగుల నర్సయ్య వివరాల ప్రకారం.. కాచిగూడ కబే ళా ప్రాంతానికి చెందిన బాలిక (17) చాదర్‌ ఘాట్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అదే ప్రాంతానికి చెం దిన నాగరాజు కుమారుడు అఖిలేష్‌ (19) బ్యాండ్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడున్నాడు. బాలిక గర్భం ధరించడంతో పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు  అఖిలేష్‌ను అడగగా తనకు సంబంధంలేదంటూ దుర్భా షలాడాడు. శుక్రవారం రాత్రి సదరు బాలి కకు రక్తస్రావమైంది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న  బాలిక ఫిర్యాదు మేరకు అఖిలేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.సత్యనారాయణ తెలిపారు. అఖిలేష్‌ను  త్వరలోనే   పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement