సంచలన ఎంపీపై పరువునష్టం దావా

Zee Media Files Criminal Defamation Case Against MP Mahua Moitra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో తన తొలి ప్రసంగంతోనే యావత​ దేశం దృష్టిని ఆకర్షించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మహువా మొయ్‌త్రా చిక్కుల్లో పడ్డారు. లోక్‌సభలో తన ప్రసంగంలో సందర్భంగా జీన్యూస్‌ ఛానల్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆ ఛానల్‌ చీఫ్‌ సుధీర్‌ చౌదరీ ఆమెపై పరువునష్టం దావా కేసు వేశారు. సభలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె తమ సంస్థను ప్రస్తావిస్తూ.. దొంగ (చోర్)‌, పెయిడ్‌ న్యూస్‌ ఛానల్‌ (అమ్ముడుపోయిన వార్త సంస్థ) అన్నారని జీ న్యూస్‌ యాజమాన్యం ఆరోపిస్తోంది.

ఈ మేరకు పటియాలా హౌస్‌ కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేశారు. దీనిపై సంస్థ తరఫున న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ మాట్లాడతూ... జీ న్యూస్‌ సంస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై క్రిమిల్‌ పరువునష్టం దావా వేసినట్లు వెల్లడించారు. తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినే విధంగా సంస్థ యజమానిని దొంగ అన్నారని, దీంతో మహువా మొయ్‌త్రాపై కేసు వేసినట్లు తెలిపారు.  కాగా బెంగాల్‌లోని కృష్ణానగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన మొయ్‌త్రా.. మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top