
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, సీఈసీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు పాల్గొంటారని తెలిపారు.