వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శిగా కడపల  | YSRCP National Secretary is Kadapala Srikanth Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శిగా కడపల 

Apr 29 2018 3:52 AM | Updated on May 29 2018 4:37 PM

YSRCP National Secretary is Kadapala Srikanth Reddy - Sakshi

అనంతపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి కడపల శ్రీకాంత్‌రెడ్డిని పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కడపల శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 4న వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం, పెద్దకడపవాండ్లపల్లికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి దివంగత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి స్వయానా మేనల్లుడు.  

Advertisement
 
Advertisement
Advertisement