మేడమ్‌.. అనుమతించండి | YSRCP MPs Met Lok Sabha Speaker Sumitra Mahajan | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Mar 20 2018 11:53 AM | Updated on Oct 17 2018 6:18 PM

YSRCP MPs Met Lok Sabha Speaker Sumitra Mahajan - Sakshi

సుమిత్రా మహాజన్‌తో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా చూడాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం మహాజన్‌ను ఆమె కార్యాలయంలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

కేంద్రంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించాలని స్పీకర్‌ను కోరినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్పీకర్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత 15 రోజులుగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా ఆర్థికబిల్లును ఆమోదించారని గుర్తుచేశారు. సభ ఆర్డర్‌లో లేదన్న కారణంతో సభా కార్యకలాపాలను వాయిదా వేయడం సరికాదన్నారు.

అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి
సభా కార్యక్రమాలకు అడ్డుపడొద్దని, అవిశ్వాసానికి మద్దతివ్వాలని అన్నాడీఎంకె ఎంపీలను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని మాజీ ప్రధాని, జెడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement