‘టచ్‌’ మహిమతో వారికి దరిద్రాన్ని అంటించారు’ | Sakshi
Sakshi News home page

‘సీఎం జగన్‌.. 4నెలల్లోనే 80శాతం హామీలు నెరవేర్చారు’

Published Wed, Oct 23 2019 12:04 PM

YSRCP MP Vijay Sai Reddy Criticize Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వంశపారంపర్య అర్చకత్వానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలపడం పట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వంశపారంపర్య అర్చకత్వ చట్టాన్ని అమలులోకి తెచ్చి ఆలయాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు సీఎం జగన్‌ భరోసా కల్పించారని ప్రశంసించారు. ఈ మేరకు బుధవారం విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. సీఎం జగన్‌ నిర్ణయంతో గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నింటిని పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నాలుగు నెలల పాలనలోనే సీఎం జగన్‌ 80శాతం హామీలను నెరవేర్చారని ప్రశంసించారు. 

బీజేపీ క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తున్నారు
చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ ​కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో జతకట్టి తన దరిద్రాన్ని అందరికీ అంటించాడని ఎద్దేవా చేశాడు. ‘ఒక వ్యక్తి తన ‘టచ్‌’ మహిమతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కోలుకోకుండా చేశారు. తన దరిద్రాన్ని అందరికి అంటించి వచ్చారు. వచ్చే జనవరిలో ఢిల్లీ, 2021 మేలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటి ఫలితాలెలా ఉంటాయో మనం ఊహించవచ్చు. తనేమో బిజెపీ ‘క్షమాభిక్ష’ కోసం ఎదురు చూస్తున్నాడు’  అంటూ చంద్రబాబును పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీలతో జతకట్టిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement