చంద్రబాబు, లోకేష్‌లపై మండిపడిన గ్రంధి శ్రీనివాస్‌

YSRCP MLA Grandhi Srinivas Fires On TDP Leaders - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: ఇప్పటికైనా టీడీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఈ 23 సీట్లు కూడా రావు జాగ్రత్త అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ హెచ్చరించారు. శుక్రవారం భీమవరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఇసుక కోసం పోరాటం చేయడం చూస్తే.. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడిని అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని జుట్టు పట్టుకుని కొట్టలేదా అని ప్రశ్నించారు. అందువల్లే రాష్ట్ర ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక దోపిడిని అరకట్టడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అక్రమాలు జరగకుండా న్యాయమైన ధరలకే వినియోగదారులకు ఇసుక అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

అవినీతి, అక్రమాలు, దందాలు, రౌడీయిజం చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు. పోలవరం, రాజధాని విషయంలో చంద్రబాబు, లోకేష్‌, టీడీపీ మంత్రులు వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆరోపించారు. టీడీపీ తన తప్పుల నుంచి ప్రజల దృష్టి మళ్లించాడనికి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top