‘బాబూ.. మంగళగిరిలో మీ అబ్బాయి గెలవడు’

YSRCP MLA Alla Ramakrishna Reddy Satires On Chandrababu And Lokesh - Sakshi

మంగళగిరి పలకడం రాదు ఎలా ఎన్నుకుంటారు?

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆర్కే సెటైర్స్‌

సాక్షి, మంగళగిరి : ‘చంద్రబాబూ.. నువ్వు ఎన్నిచేసినా మీ అబ్బాయి మంగళగిరిలో గెలవలేడు.. 9న జరిగే ఎన్నికల్లోనూ గెలవలేడు..’ అంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్లరామకృష్ణ రెడ్డి (ఆర్కే) ఎద్దేవా చేశారు. ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతోందని ధీమా వ్యక్తం చేశారు. ‘నీకొడుక్కి పార్టీ తెలియదు.. పార్టీ గుర్తు తెలియదు. మంగళగిరి నియోజకవర్గ నైసర్గిక స్వరూపం తెలియదు. మంగళగిరి అనే పేరు పలకలేడు. నామినేషన్‌ వేయటం రాదు.. ఎన్నికల కౌంటింగ్‌ డేట్‌ తెలియదు. అలాంటి వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎలా ఎన్నుకుంటారు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మంగళవారం మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారాలోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించి సభికులను కడుపుబ్బా నవ్వించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top