మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం | YSRCP Leaders supports to Fishermen Agitation | Sakshi
Sakshi News home page

Jan 23 2018 1:56 PM | Updated on May 25 2018 9:28 PM

YSRCP Leaders supports to Fishermen Agitation - Sakshi

సాక్షి, విశాఖపట్నం : తమను ఎస్టీల్లో చేర్చాలని 20 రోజులుగా మత్స్యకారులు చేస్తున్న దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల దీక్షకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు వారికి సంఘీభావం తెలిపారు. 

వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావులు, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం మత్సకారుల వద్దకు వెళ్లి  తమ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని.. మత్స్యకారులను కూడా మోసం చేస్తే రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని వారు టీడీపీని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement