
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒలంపిక్స్‌లో అబద్ధాల పోటీ పెడితే.. మాజీ సీఎం చంద్రబాబుకే అన్ని పతకాలు దక్కుతాయన్నారు. జీవీఎంసీ, వుడా కేంద్రంగా టీడీపీ నేతలు జరిపిన అక్రమాల్లో త్వరలోనే అసలు సూత్రధారులను బయటకు తీయడం జరుగుతుందన్నారు. పార్టీలకతీతంగా గ్రామ వాలంటీర్ల నియామకారలు జరుగుతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధింస్తుందని సుధాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు